Friday 13 February 2015

I love this song alot. Unni krishnan sir voice awesome

నీ పిలుపే ప్రేమ గీతం
నీ పలుకే ప్రేమ వేదం
ఆశలే బాసలై కలలు గనే పసి మనసులై
కవితలు పాడి.. కవ్వించనీ.. కవ్వించనీ.. కవ్వించనీ..
కళ్ళు కళ్ళు మూసుకున్న హృదయంతో మాట్లాడునమ్మ ప్రేమా
నిద్దుర చెదిరిపోయేనమ్మా నేస్తం కోసం వెతికేనమ్మ ప్రేమా
ఆడించి పాడించి అనురాగం కురిపించి అలరించేదే ప్రేమ
రమ్మంటే పొమ్మంటూ పొమ్మంటే రమ్మంటూ కవ్వించేదే ప్రేమ
ప్రేమలకు హద్దు లేదులే దాన్ని ఎవ్వరైన ఆపలేరులే
నీ పిలుపే ప్రేమ గీతం
జాతి లేదు మతము లేదు కట్నాలేవి కోరుకోదు ప్రేమ
ఆది లేదు అంతం లేదు లోకం అంతా తానై ఉండును ప్రేమ
ఊరేదో పేరేదో కన్నోళ్ళ ఊసేదో అడగదు నిన్ను ప్రేమ
నాలోన నీవుండి నీలోన నేనుండి జీవించేదే ప్రేమ
జాతకాలు చూడబోదులే ఎన్ని జన్మలైన వీడిపోదులే
నీ పిలుపే ప్రేమ గీతం
నీ పలుకే ప్రేమ వేదం
ఆశలే బాసలై కలలు గనే పసి మనసులై
కవితలు పాడి.. కవ్వించనీ.. కవ్వించనీ.. కవ్వించనీ..
గానం : ఉన్నికృష్ణన్, చిత్ర
సాహిత్యం : భువనచంద్ర
సంగీతం : దేవా

No comments:

Post a Comment